Andhra Pradesh : నేడు చంద్రబాబు వారికి గుడ్ న్యూస్ చెప్పనున్నారా? కేబినెట్ భేటీలో ఇదే ప్రధానమా?

నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలన్న కృత నిశ్చయంతో ఉంది

Update: 2024-07-16 04:37 GMT

నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలన్న కృత నిశ్చయంతో ఉంది. ఇప్పటికే నాలుగువేల పింఛను అధికారంలోకి వచ్చిన మొదటి నెల అమలు చేశారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే మూడు వేలు కలపి మరీ వృద్ధులు, వితంతువులకు మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలను ఇచ్చారు. నూరు శాతం అంగవైకల్యం కలిగిన దివ్యాంగులకు 15,000 రూపాయలు, మిగిలిన దివ్యాంగులకు 3 వేల నుండి 6000 రూపాయలకు పెంచారు. వచ్చే నెల నుంచి అన్నా క్యాంటిన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేేశారు. 16,500 పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది.

అనేక హామీలను...
ఇక ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే అమలులోకి తేవడంతో ఏపీలో నిర్మాణ రంగం ఊపందుకుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని దొరుకుతుందని ప్రభుత్వం భావించి ఉచిత ఇసుక విధానాన్ని వెంటనే అమలులోకి తెచ్చింది.గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఉన్న అన్న క్యాంటీన్లలో ఐదు రూపాయలకే అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్లను వచ్చే ఆగస్టు మాసంలో తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలా వరసగా మహిళలు, పేదలు, నిరుద్యోగులు లక్ష్యంగా తాము ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు.
ఎప్పటి నుంచి అనేది...
అయితే ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానుండటంతో తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా వీలయినంత త్వరగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే మంత్రి వర్గ సమావేశంలో తల్లికి వందనం కార్యక్రమం అమలుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. దీనిపై ఇప్పటికే విధివిధానాలు ఖరారయ్యాన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాము చెప్పిన దానికి కట్టుబడి ఉన్నామని, ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని కేబినెట్ భేటీ తర్వాత వెల్లడయ్యే అవకాశముందని తెలిసింది.
మార్గదర్శకాలను...
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ప్రతి బహిరంగ సభలో చెప్పిన సంగతి తెలసిందే. అయితే దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారంటున్నారు. విద్యార్థుల తల్లులు తమ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకుంటే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను నివారించవచ్చన్న భావనలో ఈ ప్రభుత్వం ఉంది. పాఠశాలల్లోనే ఆధార్ అప్‌డేట్ చేసుకోవడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఏపీ వాసులు ఎవరికైనా, అక్కడ స్థిరనివాసం ఉండి, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపితే, 75 శాతం హాజరు ఉంటే తల్లికి వందనం స్కీమ్ దక్కుతుందని చెబుతున్నారు. నేడు జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఖరారయ్యే అవకాశాలున్నాయి. దీనిపై ఈరోజు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశముందని చెబుతున్నారు.


Tags:    

Similar News