కొండచరియలు విరిగి పడిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
విజయవాడలో కొండచరియలు విరిగిపడి ఇల్లుకూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఇల్లు కూలిపోయిన ఘటనలో నలుగురు మృతి చెందారు
విజయవాడలో కొండచరియలు విరిగిపడి ఇల్లుకూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఇల్లు కూలిపోయిన ఘటనలో నలుగురు మృతి చెందారు. విజయవాడ మొగల్రాజపురం సున్నపుబట్టీల సెంటర్ లో ఈ ఘటన చోటచేసుకుంది. మృతులు బోలెం లక్ష్మి, బోలెం మేఘన, లాలు, అన్నపూర్ణ మరణించినట్లు తెలిపారు. ఇంకా శిధిలాల కింద మరొకరు ఉండవచ్చన్న అనుమానంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది.
మృతుల కుటుంబాలకు...
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఉండవల్లిలోని తన నివాసం నుంచి అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. కొండలపై నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారిని పునరావాస కేంద్రాలకు తీసుకు వచ్చారు. అధికారులు నిత్యం తిరుగతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. విజయవాడ నగరంలో అనేక చోట్ల విద్యుత్తు సరఫరానిలిచిపోయింది