Tirumala : గోవిందా... కరుణించవా సామీ.. కనికరించు తండ్రీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

Update: 2024-07-05 03:15 GMT

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మాడ వీధుల్లోనూ భక్తుల అధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. వసగి గృహాల కేటాయింపు కూడా ఆలస్యమవుతుంది. శ్రీవారి దర్శనం కోసం బయట వరకూ క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. గంటల సమయం శ్రీవారి దర్శనానికి పడుతుంది. లడ్డూల కౌంటర్ నుంచి ప్రతి కౌంటర్ వద్ద ఎక్కడ బట్టినా భక్తులతో నిండిపోయింది. అధికారులు భక్తులు రద్దీ పెరగడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

బయట వరకూ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లలో భక్తులు నిండిపోయారు. బయట ఏటీసీ వరకూ క్యూ లైన్ లు విస్తరించి ఉన్నాయి. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు ఉచిత ప్రసాదాన్ని అందచేస్తున్నారు. మంచినీరు అందిస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈరోజు ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు ప్రవేశించిన భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,826 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 27,530 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్ల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు


Tags:    

Similar News