Kakinad : కాకినాడ పోర్టులో మరోసారి తనిఖీలు

కాకినాడ పోర్టులో అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్టెల్లా పనామా నౌకలో ఈ సోదాలు చేస్తున్నారు.;

Update: 2024-12-04 07:50 GMT

కాకినాడ పోర్టులో అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్టెల్లా పనామా నౌకలో ఈ సోదాలు చేస్తున్నారు. కాకినాడ పోర్టు నుంచి స్టెల్లా నౌకలో రేషన్ బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సోదాలు జరుపుతున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ పోలీసు, రెవెన్యూ, సివిల్ సప్లయిస్, కస్టమ్స్, పోర్టు అధికారులతో ఒక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.

కమిటీ నౌకలోకి వచ్చి...
ఈ కమిటీ కొద్దిసేపటి క్రితం స్టెల్లా నౌకలో ఉన్న బియ్యాన్ని తనిఖీ చేస్తున్నారు. అది రేషన్ బియ్యమా? ఎక్కడి నుంచి దీనిని తీసుకువచ్చారు? ఎవరు దీనిని లోడ్ చేయించారు? అన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ అవుతున్నాయంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నౌకను తనిఖీ చేసి సీజ్ చేయాలని ఆదేశించడంతో అధికారులు ఆ షిప్ ను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. సుమారు 640 టన్నుల బియ్యం ఉన్నట్లు ఇటీవల కలెక్టర్ జరిపిన విచారణలో వెల్లడయింది.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News