Cyclone Effect : తీర ప్రాంతంలో హై అలెర్ట్.. సురక్షిత ప్రాంతాలకు తరలింపు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపాను గా మారి తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు తెలిపారు

Update: 2024-10-15 03:52 GMT

 rains in andhra pradesh today

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపాను గా మారి తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు తెలిపారు. తీర ప్రాంతంలో హై అలెర్ట్‌ను ప్రకటించారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా నిషేధించారు. తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నెల్లూరు జిల్లాలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో ముందస్తు చర్యలు అన్నింటినీ ప్రభుత్వం తీసుకుంది.

పర్యాటకులకు నోటీ ఎంట్రీ...
నెల్లూరు జిల్లాలో అధికారులు అక్కడే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అవసరమైతే అన్ని దుకాణాలు మూసివేయాలని హెచ్చరిస్తున్నారు. రెండు రోజుల నుంచి నెల్లూరు జిల్లాలో వర్షం పడుతూనే ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలు వర్షపు నీటితో ఇబ్బందులు పడుతున్నారు. తీర ప్రాంతంలో పోలీసు గస్తీని ఏర్పాటు చేసింది. పర్యాటకులు ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. తీర ప్రాంతంలో అలల ఉధృతి తీవ్రంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని కూడా సిద్ధం చేశారు.
Tags:    

Similar News