Chandrababu : బెయిల్ పై హౌస్ మోషన్ పిటీషన్

టీడీపీ అధినేత చంద్రబాబు తరుపున న్యాయవాదులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వాలని పిటీషన లో కోరారు;

Update: 2023-10-26 06:23 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తరుపున న్యాయవాదులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వాలని పిటీషన లో కోరారు. చంద్రబాబు కంటికి అత్యవరంగా చికిత్స చేయాలని, అందుకు అనుమతించాలని ఆయన కోరారు. ఇది వరకూ ఎడమ కంటికి చికిత్స జరిగిందని, ఇప్పుడు కుడి కంటికి చికిత్స చేయాల్సి ఉందని న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ప్రభుత్వ వైద్యులు కూడా చంద్రబాబు కంటికి చికిత్స అవసరమని నివేదిక ఇచ్చారని న్యాయస్థానానికి తెలిపారు.

అత్యవసర విచారణ జరపాలని...
చంద్రబాబు బెయిల్ పిటీషన్ పై అత్యవసర విచారణ జరపాలని కోరారు. ఎడమకంటికి మూడు నెలల క్రితం కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని, ఇప్పుడు కుడి కంటికి కూడా జరపాలని పిటీషన్ లో కోరారు. కాగా స్కిల్ డెవెలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయి 45 రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన కంటి ఆపరేషన్ కోసం ఇప్పుడు బెయిల్ కోసం ఆయన తరుపున న్యాయవాదులు దరఖాస్తు చేశారు.


Tags:    

Similar News