ఏపీ ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్

ఒకవైపు వరద సహాయక చర్యలు చేస్తూనే ప్రభుత్వం మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం జీతాలు, పెన్షన్ల పంపిణీ చేసింది.;

Update: 2024-09-02 12:22 GMT
chandrababu naidu,  government, good news, government employees
  • whatsapp icon

ఒకవైపు వరద సహాయక చర్యలు చేస్తూనే ప్రభుత్వం మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం జీతాలు, పెన్షన్ల పంపిణీ చేసింది. ఉదయం 8 గంటల్లోపే ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో వేతనాలు, పెన్షన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జమ చేసింది. ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో 5,500 కోట్ల రూపాయు జమ చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేసింది.

వరద సహాయక చర్యలు...
మరో పక్క వరద సహాయక చర్యలకు నిధులు డ్రా కోసం ట్రెజరీలను సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిన్నటి నుంచి నిధుల డ్రా కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పింఛన్లతో పాటు ఉద్యోగుల జీతభత్యాలను కూడా ప్రతి నెల ఒకటో తేదీన జమ చేస్తుంది.


Tags:    

Similar News