పాపికొండల యాత్రకు బ్రేక్
గోదావరిలో పాపికొండల యాత్రను అధికారులు నిలిపేశారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో నిలిపేసినట్లు అధికారులు తెలిపారు
గోదావరిలో పాపికొండల యాత్రను అధికారులు నిలిపేశారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల యాత్రను నిలిపేసినట్లు అధికారులు తెలిపారు. రాజమండ్రి, భద్రాచలం నుంచి యాత్రకు సిద్ధంగా ఉన్న బోట్లను అధికారులు ముందస్తు చర్యలుగా నిలిపేశారు.
రెండు రోజుల పాటు....
రెండు రోజుల పాటు పాపికొండల యాత్రను నిలిపేసినట్లు అధికారులు తెలిపారు. తుఫాను తీవ్రత తగ్గిన తర్వాత తిరిగి యాత్రను కొనసాగించవచ్చని పేర్కొన్నారు. పర్యాటకులు కూడా బోటు యజమానులను సంప్రదించవద్దని, పాపికొండల యాత్రకు రెండు రోజుల పాటు అనుమతి లేదని పేర్కొన్నారు.