Chandrababu : టీడీఎల్పీలో ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన చంద్రబాబు.. మీ పనితీరు గమనిస్తున్నా

తెలుగుదేశం పార్టీ శాసనసభ సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-02-28 11:42 GMT
chandrababu, tdp chief, tdlp, key remarks
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీ శాసనసభ సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్లీ గెలిచి రావాలనే పట్టుదలతో ఈరోజు నుంచే పనిచేయాలని సూచించారు. అందరూ మళ్లీ గెలివాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక కష్టాలు ఉన్నా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నామని, ఎమ్మెల్యేల పనితీరుపై నేను ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తున్నానని చంద్రబాబు తెలిపారు.

కార్యకర్తలను విస్మరించొద్దు...
తాను త్వరలో మీతో ముఖాముఖి మాట్లాడతా నంటూనే పార్టీని వదిలేస్తే అందరం మునుగుతామని చంద్రబాబు అన్నారు. అందుకనే పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలపై దృష్టి పెట్టాలని, ఎమ్మెల్యేలు కార్యకర్తలను, ద్వితీయ శ్రేణి నేతలను కలుపుకుని వెళితేనే ముందుకు వెళ్లగలుగుతామని తెలిపారు. పార్టీని ఎవరూ నిర్లక్ష్యం చేయవదని, .దెబ్బతిన్న రోడ్లను రెండు నెలల్లో పూర్తి చేయాలని అన్నారు. నియోజకవర్గంలో పనులపైనా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.


Tags:    

Similar News