Ys Jagan : ఎన్నికల ఫలితాలు శకుని చేతిలో పాచికల్లా మారాయ్

వైసీపీ నేతల సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు;

Update: 2024-06-13 07:43 GMT

వైసీపీ నేతల సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నలభై శాతం మంది ప్రజలు మనవైపే ఉన్నారన్నారు. కేసులకు ఎవరూ భయపడవద్దంటూ జగన్ సమావేశంలో అన్నారు. కేసులకు భయపడి పారిపోకుండా పోరాడటమే లీడర్ల లక్షణమని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికలా మారాయన్నారు. ఈవీఎంలపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని జగన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బీజేపీ, టీడీపీ, జనసేన హనిమూన్ నడుస్తుందని, దానికి కొంత సమయమిద్దామని జగన్ అన్నారు.

ఎవరూ ప్రలోభాలకు...
ఎమ్మెల్సీలు ఎవరూ ప్రలోభాలకు లొంగిపోవద్దని, పార్టీలో కొనసాగితే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. అసెంబ్లీలో మన నోరును కట్టడి చేసే అవకాశముందని, శాసనసమండలిలో వైసీపీ బలం ఎక్కువగా ఉందని, అక్కడ మనం వాయిస్ వినిపిద్దామని జగన్ అన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా ఏ పనిచేసినా దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించి తిరిగి ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ చేసుకోవాలని నేతలకు పిలుపునిచ్చారు. కార్యకర్తలకు అండగా నిలవాలని, దాడులు చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తామని జగన్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
.


Tags:    

Similar News