ప్రభాస్, మహేష్.. నాకంటే పెద్ద హీరోలు: పవన్ కళ్యాణ్

రానున్న ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే క్రిమినల్ గ్యాంగ్‌తో గొడవ పెట్టుకున్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే

Update: 2023-06-22 02:41 GMT

వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కాకినాడలోని ముమ్మిడివరంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్ హీరోలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్, మహేష్.. నాకంటే పెద్ద హీరోలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్టీఆర్, చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్లని.. అయితే తన కంటే పెద్ద స్టార్లు అయ్యారని ఇగో తనకు ఉండదని అన్నారు పవన్. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ.. వీళ్లందరంటే నాకు గౌరవం, ఇష్టం. వాళ్ల సినిమాలు నేను చూస్తా. కనిపిస్తే మాట్లాడుకుంటాం. అయితే సినిమాల పరంగా మీకు హీరోల మీదున్న ఇష్టాన్ని రాజకీయంగా చూపించకండి. ఎందుకంటే రాజకీయాలు వేరు. ఇక్కడ రైతుకు కులం లేదు. సినిమాలు ఇష్టపడితే మహేష్, జూనియర్ ఎన్టీఆర్.. ఇలా ఎవరినైనా ఇష్టపడండి. రాజకీయం దగ్గరికి వచ్చేసరికి నా మాట వినండి ఒక్కసారి. మహేష్, ప్రభాష్ నా కంటే పెద్ద హీరోలు. పాన్ ఇండియా హీరోలు కాబట్టి నా కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయికి వెళ్లిపోయారు. వాళ్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. కానీ నేను తెలియదు. అయినా నాకు ఎలాంటి ఇగోస్ లేవు. సగటు మనిషి బాగుండాలని అనుకుంటాను. కష్టంలో ఉన్న ఒక దళిత కుటుంబంలోని పేదరికాన్ని పారదోలడం గురించే ఆలోచిస్తానని చెప్పారు పవన్.

రానున్న ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే క్రిమినల్ గ్యాంగ్‌తో గొడవ పెట్టుకున్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతానని తెలిసే వైసీపీ ప్రభుత్వానికి ముఖ్యంగా క్రిమినల్ గ్యాంగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈసారి గెలవడం ఖాయమని, ఒకవేళ ఓడినా బాధపడనంటూ ముక్తాయింపు ఇచ్చారు. ఎన్నికల్లో ఓడినా పట్టించుకోనన్నారు పవన్ కళ్యాణ్. రాజకీయాలనేవి తనకు రిటైర్మెంట్ ప్లాన్ కాదన్నారు పవన్ కళ్యాణ్. వెఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన 70/30 శాతంగా ఉందన్నారు. అంటే 100 మంది కష్టాన్ని 30 శాతం మందికే ఇస్తున్నారని గుర్తు చేశారు. బటన్ నొక్కగానే డబ్బులు వచ్చేస్తున్నాయనుకుంటున్న ప్రజలు ఎలా వస్తున్నాయో గమనించాలన్నారు. రాజకీయాలు చేయడానికి గుండె ధైర్యముంటే చాలన్నారు. తాను మళ్లీ ఓడిపోతానని నిర్ణయించుకునే ఈ ప్రభుత్వంతో గొడవకు దిగానన్నారు పవన్ కళ్యాణ్.


Tags:    

Similar News