వణికిస్తున్న చలి... ఇదే ఈ ఏడాది కనిష్ట ఉష్ణోగ్రత

ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు చలిగాలులతో బయటకు రాలేకపోతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి

Update: 2022-01-31 02:15 GMT

ఫిబ్రవరి వస్తున్నా చలి మాత్రం తగ్గడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలు చలితో వణికిపోతున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు చలిగాలులతో బయటకు రాలేకపోతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల వరకూ పొగమంచు దట్టంగా అలుముకుంటుంది. వాహనదారులు కనపడక ఇబ్బంది పడుతున్నారు.

ఏజెన్సీ ఏరియాలో....
ప్రధానంగా విశాఖ జిల్లాలోని చింతపల్లిలో అత్యల్పంగా 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఈసారి ఇదే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. చలి గాలుల కారణంగా ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు. చలిగాలులు మరికొంతకాంలం పాటు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది.


Tags:    

Similar News