ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూపులు

ఎగ్జిట్ పోల్స్ కోసం ఏపీ ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నారు. జూన్ 1వ తేదీన విడుదల కానున్నాయి

Update: 2024-05-14 02:11 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. అయితే ఎవరు గెలుస్తారన్న దానిపై అన్ని పార్టీలూ ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. పోలింగ్ శాతం పెరగడంతో ఎవరికి వారే ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని అంచనాలు వేసుకుంటున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో ఖచ్చితత్వం పక్కన పెడితే కొంత వరకూ కొన్ని సంస్థలు ఇచ్చే సర్వే రిపోర్టులు వాస్తవాలను ప్రతిబింబిస్తాయన్న నమ్మకం ప్రజల్లో ఉంది. అందుకే ఎగ్జిట్ పోల్స్ కోసం ఏపీ ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నారు.

జూన్ 1వ తేదీన...
ఎగ్జిట్ పోల్స్ కోసం కేవలం ప్రజలే కాదు రాజకీయ పార్టీలు కూడా మీడియా సంస్థలకు ఫోన్ లు చేసి మరీ ఎవరికి అనుకూలంగా పోలింగ్ జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. అయితే దేశంలో ఇంకా ఎన్నికలు జరుగుతున్నందున చివరి దశ పోలింగ్ ముగిసిన తర్వాతనే ఎగ్జిట్ పోల్స్ ను ప్రసారం చేసేందుకు వీలుంది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జూన్ 1వ తేదీతో ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. మొత్తం ఏడు దశల ప్రక్రియ పూర్తి కానుండటంతో ఆరోజు రాత్రి ఆరు గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.


Tags:    

Similar News