ఏపీలో పీఎం మోదీ పర్యటన.. రెండోరోజు షెడ్యూల్ ఇదే

అనంతరం ఆంధ్రా యూనివర్సిటీకి చేరుకుని.. తొమ్మిది ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. తదుపరి జరిగే..

Update: 2022-11-12 03:13 GMT

pm modi vizag tour

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం రాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. రోడ్ షో అనంతరం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేతలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఈస్ట్రన్ నావల్ కమాండ్ చోళాలో రాత్రి బస చేశారు. శనివారం ఉదయం 9 గంటల నుండి ప్రధాని విశాఖ పర్యటన మొదలు కానుంది. 9 నుండి 9.30 వరకూ వీఐపీలతో భేటీ, ప్రధాని మోదీతో భేటీ 9.30 గంటలకు సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ లు భేటీ అవుతారు.

అనంతరం ఆంధ్రా యూనివర్సిటీకి చేరుకుని.. తొమ్మిది ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. తదుపరి జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. శనివారం ప్రధాని నరేంద్ర మోడీ సుమారు రూ. 3,500 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. దీంతోపాటు సుమారు రూ.7,600 కోట్ల విలువైన ఆరు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. కాగా.. ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖలో భద్రతను కట్టుదిట్టం చేశారు.


Tags:    

Similar News