గుడివాడలో కొడాలి నాని అనుచరుల అరెస్ట్

గుడివాడలో తొమ్మిది మంది వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు

Update: 2024-12-04 07:23 GMT

గుడివాడలో తొమ్మిది మంది వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు. గతంలో టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు దుకాణపై దాడి చేసిన ఘటనలో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గుడివాడలో ఉన్న రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై గతంలో పెట్రోల్ దాడి చేశారు.

తొమ్మిది మందిని...
ఈ కేసులో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీ మాత్రం దొరకలేదు. కాళీ కోసం గుడివాడ పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్యేక పోలీసు బృందాలు కాళీ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. మరికొందరు కూడా ఇదే కేసులో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందని చెబుతున్నారు.


Tags:    

Similar News