Red Sandalwood :పోలీసుల తనిఖీలు.. వాహనంలో చూసి బిత్తరపోయిన పోలీసులు

ఏపీలో మళ్లీ ఎర్రచందనం బయటపడుతోంది. ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు.

Update: 2024-03-07 11:01 GMT

Red sandalwood

Red Sandalwood :ఏపీలో మళ్లీ ఎర్రచందనం బయటపడుతోంది. ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. అయినా ఇంకా అక్కడక్కడ బయటపడుతూనే ఉన్నాయి. గతంలో పెద్ద మొత్తంలో ప్రతి రోజు బయట పడుతుండగా, పోలీసుల చర్యల కారణంగా స్మగ్లింగ్‌ అనేది భారీగానే తగ్గుముఖం పట్టింది. తాజాగా మరోసారి పోలీసులు సైతం నివ్వెరపోయే ఎర్రచందనాన్ని పట్టుబడింది.

ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా, భారీ ఎత్తున ఎర్రచందనాన్ని పట్టుబడింది. పెద్ద ఎత్తున పట్టుబడటంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. పట్టుబడ్డ ఎర్రచందనం విలువ కోట్లాది రూపాయలు ఉంటుందని, సుమారు మూడున్నర టన్నుల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని టీ.నర్సాపురం నుంచి ఢిల్లీకి అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ ఐచర్ వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు ఉన్నారు.

Tags:    

Similar News