కొడాలి నాని పై కేసు నమోదు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2024-07-06 05:55 GMT

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పై పోలీసులు కేసు నమోదు చేశారు. నానితో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై గుడివాడలో కేసు నమోదయింది. వీరిద్దరితో పాటు గతంలో పనిచేసిన జాయింట్ కలెక్టర్ మాధవీలతారెడ్డిని కూడా ఈ కేసులో పేరు చేర్చారు. తన తల్లి మరణానికి వాసుదేవరెడ్డి, కొడాలి నాని కారణమని గుడివాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో దుగ్గిరాల ప్రభాకర్ ఫిర్యాదు చేశారు.

అందిన ఫిర్యాదుతో...
తమ గోడౌన్లలో లిక్కర్ కేసులను పగలకొట్టి తగలబెట్టి పగలకొట్టారని, ఈ ఘటన జరిగిన కొద్ది రోజులుకే తన తల్లి మనస్తాపంతో మృతి చెందిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును తీసుకున్న పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News