కోర్టుకు అమరావతి రైతులు.. పోలీసులు అనుమతి నిరాకరించడంతో?
తిరుపతిలో అమరావతి రైతుల బహిరంగ సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు.;
తిరుపతిలో అమరావతి రైతుల బహిరంగ సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. పాదయాత్ర ముగింపు సభ పెద్దయెత్తున నిర్వహించాలని అమరావతి రైతులు భావించారు. ఇందుకోసం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే బహిరంగ సభకు అనుమతిచ్చేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో బహిరంగ సభను నిర్వహించుకునేందుకు అమరావతి పరిరక్షణ సమితి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది.
17న సభకు....
ఈ నెల 16వ తేదీన అమరావతి రైతుల మహా పాదయాత్ర తిరుమలకు చేరుకుంటుంది. శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలో ఈ నెల 17వ తేదీన బహిరంగ సభను నిర్వహించాలనుకున్నారు. తమకు మద్దతిచ్చిన నాలుగు జిల్లాల ప్రజలతో పాటు ప్రజాసంఘాలు, పార్టీ లకు కృతజ్ఞతలు చెప్పాలని భావించారు. పోలీసులు అనుమతివ్వకపోవడంతో సోమవారం కోర్టును ఆశ్రయించాలని అమరావతి రైతులు నిర్ణయించారు.