కాపు అయ్యుండి.. కమ్మ బాబు గెలవాలని చూస్తున్న పవన్ కళ్యాణ్: పోసాని

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ

Update: 2023-08-04 07:55 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఒక చీటర్ అని అన్నారు.. అలాంటి వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని అన్నారు. చంద్రబాబు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిది. అశ్వినీదత్ కి పొలం ఇచ్చి ప్రభుత్వ భూమి దారాదత్తం చేశారని.. అమరావతి రైతులు నిజం తెలుసుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ కాపు అయ్యుండి కమ్మ బాబు గెలవాలని చూస్తున్నావంటూ మండిపడ్డారు. పవన్ నిజం తెలుసుకోవాలని అన్నారు. మీ అన్న ఓడిపోయినా సరే అని బాబు కి సపోర్ట్ చేశావు.. నేను ఇవన్నీ అడిగితే అమ్మలు అక్కలు తిట్టిస్తావు.. చంద్రబాబు ప్రభుత్వం మొత్తం అవినీతి అన్న నువ్వు మళ్ళీ బాబు దగ్గరికి మళ్లీ ఎందుకు వెళ్ళావు పవన్ అని ప్రశ్నించారు. మనం లేకుండా బాబు గెలవడం సాధ్యం కాదని అన్నావు, మళ్ళీ అతని దగ్గరికే వెళ్ళావు... పవన్ ఆలోచించుకోవాలని పోసాని కృష్ణ మురళి అన్నారు. కాపు సోదరులు కళ్ళు తెరవాల్సిన సమయం ఇదని అన్నారు. మీ బిడ్డగా చెబుతున్నా చంద్రబాబు మాట వినకండి.. వింటే నష్టపోతారని అమరావతి రైతులను పోసాని వేడుకున్నారు.

అమరావతి భూములపై చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు చంద్రబాబుకు సిగ్గు ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించడం లేదని అన్నారు. చంద్రబాబు రోజూ సీఎం జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో పేదలకు భూమి ఇస్తే.. హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకొస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మంచి పనులు చేస్తుంటే ఏడుపెందుకు అని ప్రశ్నించారు. జగన్ కాలిగోటికి కూడా చంద్రబాబు సరిపోరని పోసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


Tags:    

Similar News