వెంకాయమ్మ పాట.. జగన్ బ్రేక్
ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ వెంకాయమ్మను మైకు వద్ద నుంచి వెంటపెట్టుకుని వచ్చారు;
ఏపీ ముఖ్యమంత్రి జగన్ చీమకుర్తి పర్యటనలో ఒక విచిత్ర ఘటన జరిగింది. చీమకుర్తి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ వెంకాయమ్మను మైకు వద్ద నుంచి వెంటపెట్టుకుని వచ్చారు. ఆమె వైఎస్సార్ మీద పాట పాడుతుండగా జగన్ తాను కూర్చున్న చోట నుంచి లేచి వచ్చి మరీ జగన్ వెంకాయమ్య ను తొడ్కొని తాను కూర్చున్న సీటు వద్దకు తీసుకెళ్లగలిగారు. ఈ ఘటన సభలో నవ్వులు పూయించాయి.
వైఎస్ మీద ...
సభ ప్రారంభమయిన తర్వాత బూచేపల్లి వెంకాయమ్మ వైఎస్ రాజశేఖరెడ్డి పై పాట అందుకున్నారు. ఆమె పాట పాడుతుండగానే జగన్ ఇక చాలు ఆపి వచ్చేయమని సైగలు చేశారు. కానీ వెంకాయమ్మ ఇదేమీ పట్టించుకోకుండా పాట ను ఆమె కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో ఆమె వద్దకు వెళ్లి భుజం మీద చేయి వేసుకుని మరీ జగన్ తీసుకువచ్చారు. ఈ ఘటన చీమకుర్తి సభలో హైలెట్ గా నిలిచింది.