హైకోర్టుకు చేరిన ఏపీ పీఆర్సీ వివాదం
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ వివాదం న్యాయస్థానం వద్దకు చేరింది. పీఆర్సీపై కొందరు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు
ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ వివాదం న్యాయస్థానం వద్దకు చేరింది. పీఆర్సీపై కొందరు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఉద్యోగుల పీఆర్సీ, సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై హైకోర్టులో గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కృష్ణయ్య హైకోర్టుకు వెళ్లారు. ఆయన వేసిన పిటీషన్ ను హైకోర్టు స్వీకరించింద.
విభజన చట్టం ప్రకారం....
విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల బెనిఫిట్ ను తగ్గించవద్దంటూ కృష్ణయ్య పిటీషన్ ను వేశారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల పీఆర్సీపై జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం చెబుతూ ఆందోళనకు దిగాయి. ప్రస్తుతం దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతుంది.