సీఎస్ కు ఫిర్యాదు చేసిన జేఏసీ నేతలు

ఏపీలో పీఆర్సీ వివాదం ఆగలేదు. తమను ఇబ్బంది పెడుతున్నారంటూ కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులపై చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు

Update: 2022-02-09 12:46 GMT

ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీ వివాదం ఆగలేదు. తమను ఇబ్బంది పెడుతున్నారంటూ కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులపై చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. తమను వీధికుక్కలతో పోలుస్తూ కొందరు ఉద్యోగులు తమ ప్రతిష్టను దిగజారుస్తున్నారని వారు ఆరోపించారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తమ మీద మాత్రమే కాకుండా ప్రభుత్వ ప్రతిష్టను కూడా మంటగలుపుతున్నారని వారు సీఎస్ కు ఫిర్యాదు చేశారు.

తమను కించపర్చారంటూ...
పీఆర్సీ సాధన సమితి నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి, బండి శ్రీనివాసరావులు ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మకు ఫిర్యాదు చేశారు. వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వారు సీఎస్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చలు జరపడం, సమ్మె విరమించడంపై పలు ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే జేఏసీ నుంచి బయటకు వచ్చాయి. వారు ప్రత్యేకంగా కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. ఈ నలుగురి నేతల ఇళ్ల ముట్టడికి కూడా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు పిలుపు నిచ్చాయి.


Tags:    

Similar News