రేపు పీఆర్సీపై జగన్ తో భేటీ

ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీపై రేపు స్పష్టత రానుంది. ముఖ్యమంత్రి జగన్ రేపు ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి.

Update: 2021-12-19 03:36 GMT

ఆంధ్రప్రదేశ్ లో పీఆర్సీపై రేపు స్పష్టత రానుంది. ముఖ్యమంత్రి జగన్ రేపు ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం పలు దఫాలు చర్చలు జరిపింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి చర్చలు జరిపారు. అయితే తమకు 48 శాతం ఫిట్ మెంట్ కావాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. దీనికి ప్రభుత్వం సుముఖంగా లేదు.

సమావేశం తర్వాతే...
జీతాలు తగ్గకుండా, ఇంటీరియం రిలీఫ్ పై ప్రభావం చూపకుండా ఫిట్ మెంట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను తాత్కాలికంగా విరమించాయి. రేపు జగన్ తో సమావేశమయిన తర్వాత దీనిపై పూర్తి స్పష్టత రానుంది. మరి ఫిట్ మెంట్ పై ప్రభుత్వం ఏ అంకె చెబుతుందోనన్న ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొంది.


Tags:    

Similar News