పీఆర్సీ పై నేడయినా స్పష‌్టత వచ్చేనా?
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల పీఆర్సీపై ఇంకా స్పష్టత రాలేదు. విడతల వారీగా చర్చలు జరుపుతున్నప్పటికీ ఫలితం లేదు. ఈ
ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల పీఆర్సీపై ఇంకా స్పష్టత రాలేదు. విడతల వారీగా చర్చలు జరుపుతున్నప్పటికీ ఫలితం లేదు. ఈరోజు మరోసారి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, చీఫ్ సెక్రటరీలతో ఉద్యోగ సంఘాలు భేటీ అయి చర్చలు జరిపారు. అయినా పీఆర్సీ పై స్పష్టత రాలేదు.
మరోసారి చర్చలు....
ఇక ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య ఫిట్ మెంట్ పై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాయి. ఇద్దరూ తమ అంకెల వద్దనే ఉండిపోయారు. ప్రభుత్వం 14. 8 శాతం, ఉద్యోగ సంఘాలు 34 శాతం ఫిట్ మెంట్ ను ఇవ్వాలని భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తో అధికారులు దీనిపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులు అడిగినంత ఇవ్వలేమని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. దీంతో ఈరోజు జరిగే చర్చల్లోనైనా కొంత మేర అయినా స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ఈరోజు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్నారు.