నేడు పీఆర్సీపై హైకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. పీఆర్సీతో తమకు అన్యాయం జరిగిందంటూ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్ ను హైకోర్టు స్వీకరించింది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
తమ ప్రయోజనాలు....
కొత్త పీఆర్సీ కారణంగా తమకు రావాల్సిన ప్రయోజనాలు రాకపోగా, జీతాలు తగ్గుతున్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పీఆర్సీ జీవోను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.