ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాల్సిందే.. నిర్మాతల మండలి
వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పై నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది.
వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పై నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన తెలీసీ తెలియకుండా మాట్లాడారంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. సినిమా వాళ్లకు బలిసింది అనడం బాధాకరమని నిర్మాతల మండలి తెలిసింది. నిజానిజాలు తెలుసుకోకుండా అలా వ్యాఖ్యానించడం ప్రసన్నకుమార్ రెడ్డికి సరికాదని తెలిపింది. మొత్తం సినిమా పరిశ్రమను ఆయన అవమానించారని అభిప్రాయపడింది.
సక్సెస్ రేటు...
తెలుగు సినిమాలు కేవలం రెండు ఐదు శాతం మాత్రమే సక్సెస్ అవుతున్నాయని, మిగిలిన సినిమాలు నష్టపోతున్నాయని వారు తెలిపారు. అనేక సినమాల నిర్మాతలు నష్టపోతయి నిర్మాతల మండలి నుంచి నెలకు మూడు వేల పెన్షన్ ను తీసుకుంటున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.