వర్షం ముప్పు ఉంది.. ఏయే జిల్లాలకంటే?
మిచౌంగ్ తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారింది
మిచౌంగ్ తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఛత్తీస్‌గఢ్ సమీపంలో ఉంది. ఈ ప్రభావంతో అక్కడక్కడా వానలు పడుతున్నాయి. ఏపీలో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
తుఫాను తీరం దాటిన మూడు రోజుల వరకూ దాని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. అందువల్ల శుక్రవారం కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.