ఫ్రీగా బంగినపల్లి మామిడిపండ్లు

నూజివీడు రైతు రాజగోపాల్ విన్నూత్న నిరసనకు దిగారు. దళారీల దోపిడీని నిరసిస్తూ అందరికీ ఉచితంగా మామిడి పండ్లను పంపిణీ చేశారు

Update: 2023-05-14 06:17 GMT

నూజివీడు రైతు రాజగోపాల్ విన్నూత్నంగా నిరసనకు దిగారు. దళారీల దోపిడీని నిరసిస్తూ అందరికీ ఉచితంగా మామిడి పండ్లను పంపిణీ చేశారు. ఏలూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఏలూరు సబ్ కలెక్టర్ కార్యలయం నుంచి చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వరకు బంగినపల్లి మామిడికాయలు ఉచితంగా పంచుతూ రైతు నిరసన దిగారు. ఆగిరిపల్లి మండలం కొత్త ఈదర గ్రామానికి చెందిన రైతు దళారీల వలన నష్టపోతున్నామంటూ ఆవేదన చెందారు.

గిట్టుబాటు ధర లేక...
తన తోటలో పండిన మామిడికాయలను నూజివీడు నుంచి తీసుకొచ్చి ఉచితంగా వచ్చి పోయే వారందరికీ పంపిణీ చేశారు. అకాల వర్షాలకు మామిడి తోటలోని మామిడికాయలు మంగు,మసితో పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. తాము మామిడి పండ్లను మార్కె‌ట్ కు తీసుకు వెళ్తే కొనే వారు లేరని, తీవ్ర నష్టాలను చవి చూడాల్సి వస్తుందని, అందుకే ఈ ఇబ్బందులు పడలేక ఉచితంగా పంచుతున్నానని రైతు రాజగోపాల్ తెలిపారు.
Tags:    

Similar News