రాజంపేటలోనూ ఫ్యాన్ హవా
రాజంపేట మున్సిపాల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. నాలుగు వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది.;
రాజంపేట మున్సిపాల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. మొత్తం 29 వార్డులున్న రాజంపేటలో ఇప్పటి వరకూ నాలుగు వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. 1,2, 15, 18 వార్డుల్లో వైసీీపీ అభ్యర్థులు విజయం సాధించారు. రాజంపేటలో అన్ని వార్డుల్లో టీడీపీ, వైసీపీ హోరాహోరీగా పోరాడుతున్నాయి.
టీడీపీ గట్టి పోటీ....
రాజంపేట గత ఎన్నికల్లోనూ వైసీపీకి అనుకూలంగా వచ్చింది. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలవడంతో కొంత ఆ పార్టీకి ఫలితాలు అనుకూలంగా రావచ్చన్న అంచనాలు వచ్చాయి. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటికే నాలుగు వార్డుల్లో వైసీపీ విజయం సాధించిదంి. మరో 12 వార్డుల్లో విజయం సాధిస్తే మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగిరినట్లే.