బాబుకు విజయసాయి స్పెషల్ గ్రీటింగ్స్
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రత్యర్థి పార్టీలను విమర్శించడంలో ఎప్పుడూ ముందుంటారు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రత్యర్థి పార్టీలను విమర్శించడంలో ఎప్పుడూ ముందుంటారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఢిల్లీ లో పార్టీ పనులను చూస్తూనే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడం మానరు. చంద్రబాబు, లోకేష్ లపై అవకాశం వచ్చినప్పుడల్లా, సందర్భం చూసుకుని మరీ సెటైర్లు వేయడంలో విజయసాయిరెడ్డి దిట్ట. విజయసాయిరెడ్డి ట్విట్టర్ అకౌంట్లో ఎక్కువగా చంద్రబాబు, లోకేష్ లపై ఎక్కువగా విమర్శలుంటాయి.
ప్రేమికుల దినోత్సవం నాడు....
తాజాగా విజయసాయిరెడ్డి ప్రేమికుల దినోత్సవం రోజు కూడా చంద్రబాబును వదలలేదు. "దేశంలోని ఎన్నో పార్టీలతో ప్రేమాయణం సాగించిన ప్రేమికుడు చంద్రబాబు. ప్రతి ఐదేళ్లకొకసారి లవర్ ను మారుస్తూ ఉంటాడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ వీర ప్రేమికునికి శుభాకాంక్షలు" అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.