త్వరలోనే వైసీపీ సభ్యత్వ కార్యక్రమం
వైసీపీ సభ్యత్వ నమోద కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు
వైసీపీ సభ్యత్వ నమోద కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. వైసీపీ అనుబంధ విభాగాలతో ఆయన మాట్లాడారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అనుబంధ సంఘాల నేతలు సీరియస్ గా తీసుకోవాలన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకునేలా చూడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని విజయసాయిరెడ్డి కోరారు.
అందరికంటే...
సభ్యత్వ నమోదులో ఇతర పార్టీల కంటే ముందుండాలన్నారు. బలవంతంగా కాకుండా పార్టీ చేస్తున్న కార్యక్రమాలను చూసి వారంతట వారే సభ్యత్వం తీసుకునేలా కార్యకర్తలు కృషి చేయాలని విజయసాయిరెడ్డి పిలుపు నిచ్చారు. త్వరలోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే పార్టీకి మరోసారి విజయాన్ని అందిస్తాయని విజయసాయిరెడ్డి తెలిపారు.