మత్స్యకారుల వలలో 1500 కిలోల టేకు చేప.. ధర ఎంతంటే !
సముద్రంలో వలలు విసరగా, అందులో ఏదో బరువైన వస్తువు చిక్కుకుపోయినట్లు మత్స్యకారులు గమనించారు. వారు దానిని పైకి..
సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు అప్పుడప్పుడు అరుదైన చేపలు, భారీ చేపలు లభ్యమవుతుంటాయి. అవే వారిపాలిట బంగారు బాతులవుతాయి. తాజాగా అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం బంగారమ్మపాలెంకు చెందిన మత్స్యకారుల బృందం సముద్రంలో వేటకు వెళ్లింది. సముద్రంలో వలవేసి చేపలు పడుతున్న వారి వలలోకి భారీ చేప చిక్కింది. అదే టేకు చేప. దాని బరువు 1500 కిలోలు. ఈ చేపను తినేందుకు వాడరు. మందుల తయారీలోకి టేకు చేపనుండి వచ్చే ఆయిల్ ను వాడుతారు. 1500 కిలోల బరువుతున్న ఈ చేప ధర మార్కెట్లో రూ.4 లక్షలకు పైగానే ఉంటుందని మత్స్యకారులు పేర్కొన్నారు.
సముద్రంలో వలలు విసరగా, అందులో ఏదో బరువైన వస్తువు చిక్కుకుపోయినట్లు మత్స్యకారులు గమనించారు. వారు దానిని పైకి లాగినప్పుడు, వారి వలలో చిక్కుకున్న ఒక భారీ చేపను చూసి వారు ఆశ్చర్యపోయారు. చేప భారీ బరువు ఉన్నప్పటికీ, మత్స్యకారులు దానిని ఒడ్డుకు చేర్చగలిగారు. ఆ భారీ చేపను చూసేందుకు సమీపప్రాంతాల వారు అక్కడికి తరలివెళ్లారు. ఆ చేపను తామే పట్టామని మత్స్యకారులు గర్వంగా చూపించారు.