తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ..

కాగా.. నేడు తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి..

Update: 2023-04-27 03:25 GMT

Rush in Tirumala

వేసవి సెలవులు మొదలయ్యాయి. ఇకపై వారాంతంలో కాకుండా.. వారమంతా కూడా తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. దేశ నలుమూలల నుండి భక్తులు మొక్కులు చెల్లించుకుని, శ్రీవారిని దర్శించుకునేందుకు రానున్నారు. కాగా.. నేడు తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది.

నిన్న (ఏప్రిల్ 26) శ్రీవారిని 63,382 మంది భక్తులు మొక్కులు చెల్లించుకుని, దర్శించుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ క్రమంలో నిన్న స్వామివారికి రూ.3.25 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. అలాగే స్వామివారికి 27,478 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా.. ఇటీవలే టీటీడీ శీఘ్ర దర్శనం టికెట్లను విడుదల చేసింది. రానున్న రోజుల్లో భక్తుల రద్దీని అంచనా వేస్తూ.. భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.


Tags:    

Similar News