న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్న గంటా

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించేందుకు సిద్దమవుతున్నారు

Update: 2022-03-27 02:12 GMT

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించేందుకు సిద్దమవుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు నిరసనగా గంటా శ్రీనివాసరావు గత ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్ లో తన రాజీనామా పత్రాన్ని పంపారు. అయితే ఏడాది గడుస్తున్నా స్పీకర్ గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించలేదు.

రాజీనామా ఆమోదానికి....
గతంలో స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసి తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా గంటా శ్రీనివాసరావు కోరారు. అయినా ఆయన రాజీనామా ఆమోదం పొందలేదు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు తన రాజీనామాను ఆమోదించాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించారు. సోమవారం గంటా కోర్టులో పిటీషన్ వేసే అవకాశముంది.


Tags:    

Similar News