బస్సు నడుపుతుండగా డ్రైవర్ కు గుండెపోటు... ఏం జరిగిందంటే?

ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. బస్సు నడుపుతుండగా గుండెపోటు రావడంతో అతను స్టీరింగ్ పైనే మరణించాడు

Update: 2024-10-16 05:42 GMT

rtc bus driver heart attack 

ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. బస్సు నడుపుతుండగా గుండెపోటు రావడంతో అతను స్టీరింగ్ పైనే మరణించాడు. అయితే ఆర్టీసీ బస్సు ఒక పాలాల్లోకి ఒరిగి పోయింది. కానీ హార్ట్ అటాక్ రావడంతో డ్రైవర్ ముందు వెళుతున్న సైకిల్ ను ఢొకొట్టగా ఈ ప్రమదంలో సైకిల్ పై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి.

అరవై మంది ప్రయాణికులు...
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో అరవై మంది ప్రయాణికులున్నారు. వారంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. బాపట్ల డిపోకుకు చెందిన ఆర్టీసీ బస్సు రేపల్లె నుంచి చీరాల వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. బస్సును పక్కనే ఉన్న పొలాలలోకి దూసుకెళ్లింది. దీంతో డ్రైవర్ డి. సాంబశివరావు చనిపోయారు.
Tags:    

Similar News