Andhra Pradesh : నేడు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు
ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనుంది;

satyanarayana passed away
ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీ నేడు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనుంది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా అందులో ఒకటి జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేశారు. మిగిలిన నాలుగుస్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను చంద్రబాబు నేడు ఖరారు చేయనున్నారు.
బీజేపీ స్థానంపై...
అయితే నాలుగు స్థానాల్లో బీజేపీకి ఇచ్చే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి ఒక స్థానం కేటాయించడమా? లేక నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడమా? అన్నది తేలనుంది. ఈ స్పష్టత వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే అవకాశముంది. ఇప్పటికే నలుగురు పేర్లను ఆయన వడపోత చేసి డిసైడ్ చేసినట్లు తెలిసింది. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి.