Tirumala : మంగళవారం అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు;
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. వసతి గృహాల కోసం కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. మంగళవారం అయినా రద్దీ మాత్రం కొనసాగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 70,902 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,858 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.24 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 24 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.