Tirumala : తుపానులోనూ కొనసాగుతున్న తిరుమలలో రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భారీ వర్షాలు, తుపాను హెచ్చరికల నేపథ్యంలోనూ తిరుమలకు భక్తులు క్యూ కట్టారు

Update: 2024-10-16 03:02 GMT

Tirumala darshan

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భారీ వర్షాలు, తుపాను హెచ్చరికల నేపథ్యంలోనూ తిరుమలకు భక్తులు క్యూ కట్టారు. అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో దర్శనం కొంత ఆలస్యమవుతుంది. తిరుమలలో గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా నేడు తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. అయినా సరే భక్తుల తాకిడి మాత్రం తగ్గకపోవడంతో అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వర్షాలకు వారు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తుపాను కారణంగా రైళ్లు కూడా రద్దయ్యే అవకాశాలున్నాయి. అయినా సరే భక్తులు మాత్రం బారులు తీరడం కనిపించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తుల భద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల కొండ ఎక్కేటప్పుడు కొండచరియలు విరిగిపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

భక్తులతో నిండిపోయి...
తిరుమలలో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ భక్తులు మాత్రం తిరుమల వెంకటేశ్వరుడిన దర్శంచుకునేందుకు క్యూ కట్టడం విశేషం. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ భక్తులకు దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని చెప్పారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73, 891 దర్శించుకున్నారు. ఇక నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్ల రూపాయల వచ్చిందని అధికారులు తెలిపారు.
Tags:    

Similar News