Tirumala : తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ.. భారీ వర్షాలు కురుస్తున్నా?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం మంగళవారం అయినా సరే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

Update: 2024-10-15 02:21 GMT

Tirumala temple

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం మంగళవారం అయినా సరే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. మరో వైపు వాతావరణ శాఖ భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. నిన్నటి నుంచే తిరుమలలో భారీ వర్షం పడుతుంది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. వర్షానికి భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. భక్తులందరకీ వసతి గృహాలు అందేలా చూస్తున్నారు. దీంతో పాటు తిరుమలకు వాతావరణశాఖ భారీ వర్ష హెచ్చరిక నేపథ్యంలో ఈనెల రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందుకు సంబంధించి 15వ తేది మంగళవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించరని అధికారులు తెలిపారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది‌. భారీ వర్షాలతో వీవీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు.

ఇరవై గంటల సమయం...
వచ్చిన వారిని వచ్చినట్లుగా దర్శనం లభించేటట్లు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు త్వరగా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేలా క్యూ లైన్‌లు కూడా వేగంగా కదులుతున్నాయి. క్యూ లైన్ ‌లో ఉన్న వారికి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులో నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. క్యూ లైన్‌లో ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు, మజ్జిగ, పాలును టీటీడీ సిబ్బందితోపాటు శ్రీవారి సేవకులు అందచేస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు మూడు నుంచి నాలుగు గంటల దర్శన సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 75,361 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,850 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం3.91 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Tags:    

Similar News