Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ సోమవారం కూడా?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం తగ్గాల్సిన భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు

Update: 2024-09-30 02:46 GMT

Tirumala darshan

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సోమవారం తగ్గాల్సిన భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు. దసరా సెలవులకు ముందే స్వామి వీరిని వీక్షించడానికి భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివస్తున్నారు. కంపార్ట్‌మెంట్లలన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూ లైన్ లో ఉన్న వారికి అన్న ప్రసాదాలు, మంచినీటి సదుపాయాలను శ్రీవారి సేవకులు కల్పిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా లడ్డూల తయారీ చేపట్టారు. అలాగే అన్నప్రసాదాలను కూడా అధికంగా అందుబాటులో ఉంచుతూ భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కువ మంది బ్రహ్మోత్సవాలకు హాజరవుతారని అధికారులు అంచనా వేసినా ముందుగానే భక్తుల రద్దీ పెరగడంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

కంపార్ట్‌మెంట్లన్నీ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ సుమారు ఏటీసీ కాంప్లెక్స్ వరకూ క్యూ లైన్ విస్తరించిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు టైమ్ స్లాట్ టోకెన్లున్న భక్తులకు శ్రీవారి దర్శనం ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 84,066 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,044 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.02 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News