Tirumala : శనివారం నాడు భక్తుల రద్దీ ఎంతగా ఉందో తెలిస్తే?

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు;

Update: 2025-03-22 02:44 GMT
rush, devotees,  saturday, tirumala
  • whatsapp icon

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. ఏడుకొండల వాడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాను రాను వేసవి తీవ్రత ఎక్కువవుతుందని భావించడం, పరీక్షలు సీజన్ అయిపోయిన తర్వాత మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మరింత భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన భక్తులు అనేక మంది ముందుగానే తిరుమలేశుడిని దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

రద్దీకి తగినట్లుగానే...
తిరుమలలో గత కొద్ది రోజులుగా భక్తుల రద్దీ అధికంగానే కనిపిస్తుంది. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా భక్తులతో తిరుమల వీధులు నిండిపోయాయి. మాడవీధులన్నీ గోవింద నామ స్మరణలతో మారుమోగిపోతున్నాయి. తిరుమలకు ముందుగా బుక్ చేసుకున్న భక్తులతో పాటు అప్పటి కప్పడుు ఎస్.ఎస్.డి. టోకెన్లు తీసుకుని స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అయితే భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు తీసుకున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
31 కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 64,170 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 26,821 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.98 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.




Tags:    

Similar News