Andhra Pradesh : ఏపీ డీజీపీ ఆయననేనా?
ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీ ఎంపికపై కసరత్తు ప్రారంభమయింది.;

ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీ ఎంపికపై కసరత్తు ప్రారంభమయింది. డీజీపీ ఎంపిక కోసం ఇప్పటికే ఐదుగురు సీనియర్ అధికారుల పేర్లను ప్రభుత్వం కేంద్రానికి పంపింది. సీనియర్ ఐపీఎస్ అధికారులైన మాదిరెడ్డి ప్రతాప్, రాజేంద్ర నాధ్ రెడ్డి, హరీశ్ కుమార్ గుప్తా, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యం పేర్లను కేంద్రానికి ప్రభుత్వం పంపింది. ప్రస్తుతం హరీశ్ కుమార్ గుప్తా ఏపీ డీజీపీగా కొనసాగుతున్నారు.
పూర్తి కాలం డీజీపీని...
ఆయనను పూర్తి కాలం డీజీపీగా కొనసాగిస్తారా? లేక కొత్త వారిని నియమిస్తారా? అన్నది తేలనుంది. ఐదు పేర్లలో మూడు పేర్లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. ప్రస్తుతం ఇన్ ఛార్జిగా ఉన్న డీజీపీ హరీశ్ కుమార్ స్థానంలో కొత్త డీజీపీని ఎంపిక చేసి రెండేళ్ల పాటు కొనసాగించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే ఐదు పేర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఎక్కువ శాతం హరీశ్ కుమార్ గుప్తా పేరు ఖరారయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.