Tiruamala : తుఫాను వెళ్లింది... నేడు రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. తుఫాను ప్రభావం తగ్గడం, రైళ్లు పునరుద్ధరించడంతో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు
తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. తుఫాను ప్రభావం తగ్గడం, రైళ్లు పునరుద్ధరణ కావడంతో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ముందుగా మూడు వందల రూపాయల టిక్కెట్లు బుక్ చేసుకున్న వారితో పాటు సాధారణ భక్తులు కూడా తిరుమలకు చేరుకుంటుండటంతో తిరుమల కొండ భక్తులతో రద్దీగా మారింది. రేపు, ఎల్లుండి వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
ఎనిమిది గంటలు...
నిన్న తిరుమల శ్రీవారిని 56,344 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 17,616 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.26 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఐదు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్‌లోకి టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు స్వామి వారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.