Simhachlam : నేడు సింహాచలంలోనూ ఆలయ సంప్రోక్షణ
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది.;

lakshminarasimhaswamy temple
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. నాణ్యత లోపాలు ఉన్న కల్తీ నెయ్యిని వాడి సింహాచలం లడ్డూలు తయారు చేస్తున్నారని అనుమానంతో ఆలయాన్ని శుద్ధి చేయాలని అర్చకులు నిర్ణయించారు. ఆలయ సంప్రోక్షణకు అన్ని ఏర్పాట్లు చేశారు. అధికార యంత్రాంగం 9 గంటల 15 నిమిషాల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఆలయ సంప్రోక్షణ జరగనుంది. సింహాచలం దేవస్థానం సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయంతో ఈకార్యక్రమం చేపట్టారు.
అన్నవరంలోనూ...
సింహాచలం దేవస్థానం తో పాటు అన్నవరం దేవస్థానంలో కూడా తనిఖీలు నిర్వహించిన పత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నెయ్యి, పంచదార, రవ్వల్లో నాణ్యత లోపాలున్నట్లు గుర్తించారు. నిన్న అన్నవరం దేవాలయంలో శాంతి హోమం నిర్వహించారు. అధికారులు అన్నవరం ఆలయ ఈవో లేకపోవడంతో ఈరోజు సంప్రోక్షణ కోసం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.