సీమలో భారీగా బంగారం నిల్వలు.. ఎక్కడంటే?

రాయలసీమలో అతిపెద్ద బంగారు గనులను శాస్త్రవేత్తలు గుర్తించారు. వచ్చే ఏడాది నుంచి బంగారాన్ని వెలికి తీయనున్నారు

Update: 2023-10-10 02:33 GMT

రాయలసీమలో అతిపెద్ద బంగారు గనులను శాస్త్రవేత్తలు గుర్తించారు. రాయలసీమలో భారీగా గోల్డ్ మైన్స్ ఉన్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు వచ్చే ఇక్కడ భారీగా బంగారం నిల్వలున్నట్లు తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలో ఈ గోల్డ్ మైన్స్ కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. దేశంలో కల్లా ఇదే అతి పెద్ద మైన్స్ గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రయివేటు మైన్స్ కావడంతో...
ఇదే అతి పెద్ద ప్రయివేటు మైన్స్ కావడంతో వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో మైనింగ్ చేపట్టనున్నారు. ఏడాదికి 750 కిలోగ్రాముల బంగారాన్ని వెలికి తీసే అవకాశముందని తెలుస్తుంది. జొన్నగిరి మైన్స్ వద్ద ఇప్పటికే భారీ ప్రయివేటు బందోబస్తును ఏర్పాటు చేసుకున్నారు. ఈ మైనింగ్‌ను దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థ వెలికి తీయనుంది.


Tags:    

Similar News