శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో ఏడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి తాకిడి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో ఏడు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2,36,513 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 2,56,607 క్యూసెక్కులని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
పూర్తి స్థాయి నీటిమట్టం...
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 884.30 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్ల 215.8070 టీఎంసీలు. కాగా ప్రస్తుతం 211.4759 టీఎంసీలుగా ఉంది. అయితే వర్షాలు ఎగువన తగ్గితే వరద ప్రభావం కూడా తగ్గే అవకాశముందని అధికారులు చెప్పారు. ప్రస్తుతం శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుంది.