Srisailam : శ్రీశైలంలో శివరాత్రి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. లక్షల సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు
శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. లక్షల సంఖ్యలో భక్తులు అనేక రాష్ట్రాల నుంచి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. శివరాత్రికి ఏటా బ్రహ్మోత్సవాలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. శివరాత్రి బ్రహ్మోత్సవాల సమయంలో భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందన్న విశ్వాసంతో అత్యధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. మొత్తం పదమూడు రోజుల పాటు శ్రీశైలంలో ఆలయ కమిటీ బ్రహ్మోత్సవాలను నిర్వహించింది.
పదమూడు రోజులకు...
ఈ బ్రహ్మోత్సవాలకు లక్షల మంది భక్తులు హాజరయ్యారని ఆలయ కమిటీ అధికారులు చెబుతున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లన్నకు వచ్చిన హుండీ ఆదాయాన్ని లెక్చించారు. పదమూడు రోజుల బ్రహ్మోత్సవాల సమయంలో మల్లన్న స్వామికి భక్తులు 5.16 కోట్ల రూపాయలు సమర్పించారని అధికారులు వెల్లడించారు. దీంతో పాటు 122 గ్రాముల బంగారం, 5.9 కేజీల వెండి, వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా హుండీ లెక్కింపుతో తెలిసిందని అధికారులు తెలిపారు.