సోమవారం..కార్తీకమాసం...శైవ క్షేత్రాలు కిటకిట
కార్తీక మాసం సోమవారం కావడంతో ఉదయం నుంచి శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి
కార్తీక మాసం సోమవారం కావడంతో ఉదయం నుంచి శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే నదుల్లో స్నానమాచరించిన భక్తులు ఉపవాస దీక్షలు వహించి అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని దర్శించుకుంటున్నారు. తెలంగాణలోని వేముల వాడ రాజరాజేశ్వరి దేవాలయంలో ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు. నదుల్లో స్నానమాచరించి కార్తీక దీపాలు వెలిగించి శివుడిని దర్శించుకుంటున్నారు.
శ్రీశైలంలో ప్రత్యేక ఏర్పాట్లు...
మరోవైపు శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సోమవారం కావడంతో పాటు కార్తీక మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో రావడంతో దర్శనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తుల రద్దీతో శ్రీశైలంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. కర్ణాటక నుంచి అత్యధిక మంది భక్తులు తరలి శ్రీశైల క్షేత్రానికి తరలి వస్తుండటంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది.