నారా లోకేష్ హెచ్చరికల వల్ల చంద్రబాబు బెయిల్ రద్దయ్యే ప్రమాదం
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలన్న
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. భారత అత్యున్నత న్యాయస్థానం చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు కుటుంబ సభ్యులు దర్యాప్తు అధికారులను బహిరంగంగా బెదిరిస్తున్నారని సీఐడీ తరఫు న్యాయవాది ముఖుల్ రోహత్గీ పిటిషన్ లో పేర్కొన్నారు. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. కౌంటర్ దాఖలు చేసేందుకు చంద్రబాబు తరపు రెండు వారాల సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను మూడు వారాల తర్వాత చేపడతామని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం తెలిపింది.