Ayanna Pathrudu : రేపటి నుంచి రెవెన్యూ గ్రామ సభలు
రేపటి నుంచి రెవెన్యూ గ్రామ సభలు ఏపీలో వ్యాప్తంగా జరగనున్నట్లు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు
రేపటి నుంచి రెవెన్యూ గ్రామ సభలు ఏపీలో వ్యాప్తంగా జరగనున్నట్లు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. గ్రామస్థాయిలో భూతగాదాలు, రీ సర్వే అవకతవకలకు పరిష్కారాలు ఈ సభల ద్వారా లభించే అవకాశం ఉందన్నారు. ఎమ్మార్వోతో పాటు ఆర్ఐ, వీఆర్ఓ, మండల సర్వేయర్, అధికారులు పాల్గొంటారని అయ్యన్న పాత్రుడు తెలిపారు.
గ్రామసభల ద్వారా....
ప్రతి మండలానికి డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తారని అయ్యన్నపాత్రుడు చెప్పారు. గ్రామ సభల ద్వారా భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు 45 రోజుల్లో భూ సమస్యల పరిష్కారం ఉంటుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. చిన్న గ్రామాల్లో ఒకపూట, పెద్ద గ్రామాల్లో రోజంతా ఈ రెవెన్యూ గ్రామ సభలు జరుగుతాయని ఆయన తెలిపారు.